చిలకలూరిపేట మున్సిపాలిటీ కీలక నిర్ణయం
38 నుంచి 48కి పెరిగిన వార్డుల సంఖ్య చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02: చిలకలూరిపేట: పట్టణ అభివృద్ధి మరియు పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిలకలూరిపేట పురపాలక సంఘంలో వార్డుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా గతంలో ఉన్న 38 వార్డులను ఇప్పుడు 48కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో జిల్లాలోనే అత్యధికంగా 48 మంది కౌన్సిల్ సభ్యులు కలిగిన ఏకైక మున్సిపాలిటీగా చిలకలూరిపేట...