చీడిగొంది గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం?
పది ఏళ్లుగా అంగన్వాడీ కోసం ఎదురుచూపులు శిథిలావస్థలో పాఠశాల భవనం.. పిల్లల భద్రతపై ఆందోళన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దేవరాపల్లి గ్రామపంచాయతీకి చెందిన చీడిగొంది గ్రామంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు వినతులు అందజేసినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం—చీడిగొంది గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని...