చేదువాడలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 5: కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసి డైరెక్టర్ రెడ్డి శేషగిరిరావును అరుంధతి పేట ఎస్సీ వర్గీయులు ఘనంగా సన్మానించారు. గ్రామపెద్దలు,మహిళలు, టిడిపి కార్యకర్తలు కలిసి శేషగిరిరావుకు పూలమాలలు వేసి,శాలువాలతో సత్కరించారు.సమాజ సేవలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో దండోరా నాయకుడు ఇందుర్తి శ్రీనివాస్,మాజీ ప్రెసిడెంట్ చాపల వెంకటరమణ,మహిళా నాయకులు,యువకులు మరియు గ్రామస్థులు పెద్ద...