జగన్మోహన్ రెడ్డి హత్యపై చింతూరులో నిరసన ర్యాలీ
వికోట రిపోర్టర్ హత్యపై ఆగ్రహం నిందితులపై కఠిన చర్యలు కోరుతూ జర్నలిస్టుల ర్యాలీ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29: చిత్తూరు జిల్లా వికోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ (చంటి), ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి పరిటాల వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చింతూరు డివిజన్ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు....