జగన్.. వైసీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దు : ప్రత్తిపాటి
రాజకీయాలకు పనికిరాని అసమర్థలు మాటలకు సమాధానం చెప్పాల్సిన పనిలేదు. కూటమిప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ఢోకా ఉండదు. యడ్లపాడు మండలంలో రూ.20లక్షల అభివృద్ధి పనులకు ప్రత్తిపాటి శంకుస్థాపన. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 08: చిలకలూరిపేట : ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని, ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా అనుకూల మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తోందని, ఐదేళ్లలో రాష్ట్రంపై అప్పులు, ప్రజలపై పన్నుల భారం మోపిన వారు, నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి,...