జనసేన నాయకుడిపై కులదూషణ ఆరోపణలు
… న్యాయం కోసం వెళ్లిన మహిళలకు అవమానం కాజులూరు, ఏప్రిల్ 12 ,పెన్‌పవర్: న్యాయం కోసం ఆశ్రయించిన ఇద్దరు మహిళలకు అవమానం ఎదురైన ఘటన కాజులూరు మండలంలో కలకలం రేపుతోంది. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిపై కులదూషణ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న వ్యాపారంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ సన్నపు లక్ష్మి (ఎస్సీ-మాల), ఆకుల నాగదేవి అనే ఇద్దరు మహిళలు అన్యం శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించారు. అయితే, సమస్యకు పరిష్కారం చూపాల్సిన స్థానంలో ఆయన కులం పేరుతో...