జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ అందరివాడు కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 14ః భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు కాజులూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మిపేటలో కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఆశయాలు, సమానత్వ సిద్దాంతాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయి.మొదటగా జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు వీరవల్లి గణపతి, దేవు మహేశ్వరరావులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసన గంగరాజు, అనుసూరి శ్రీను, పోతుల కిషోర్, దడాల ఏడుకొండలు ,...