జలధార వేగవంతం – 100 రోజుల ప్రణాళికతో భూగర్భ జలాల పెంపు

  గంగవరం/రంపచోడవరం, ఏప్రిల్ 7: జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జలధార కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 8 మీటర్లలో ఉన్న భూగర్భ జలాలను 100 రోజుల ప్రణాళికతో 3 మీటర్లకు తీసుకురావడం లక్ష్యమన్నారు. గ్రామాల వారీగా నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడికతీత, రేన్‌వాటర్ హార్వెస్టింగ్ వంటి పనులు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 15లోపు ప్రతిపాదనలు పంపించాలని,...