జాతీయ టీ-10 మహిళా క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ ఘన విజయం
హర్షియా సుల్తానాకు అభినందనలు తెలిపిన మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05: చిలకలూరిపేట: ఐడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల 7వ టీ-10 జాతీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 లో ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి బలమైన జట్లను సమర్థంగా ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ జట్టు అజేయంగా నిలవడం రాష్ట్ర క్రీడా ప్రతిభకు...