టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి
టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి -నర్సీపట్నంలో వైసిపి నాయకుల ఆందోళన నర్సీపట్నం పెన్ పవర్ : టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తమ పార్టీ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ పవిత్రత నిలబడేలా చూడాలని ఆ భగవంతునికి...