ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసుల కఠిన చర్యలు

18 లోపు డ్రైవింగ్‌పై హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 28:   ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చింతూరు పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో మొత్తం 30 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై 15 కేసులు, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించిన వారిపై 5 కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై 3 కేసులు, అనధికార...