తెదేపాలో భారీ చేరికలు – గుర్తేడు మండలం పసుపుమయం
గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: గుర్తేడు మండలంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు.మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పల్లాల బాబురావు నాయకత్వంలో పలువురు పెద్దఎత్తున పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శిరీషాదేవి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ...