తెనాలి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన అమరావతి కృతజ్ఞత సభలో పాల్గొన్న మర్రి రాజశేఖర్.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03: చిలకలూరిపేట : తెనాలి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ అమరావతికి మద్దతుగా నిలవాలని, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైసీపీ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో రాజ్యాంగపరంగా అమరావతే శాశ్వత...