త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌పై ఇక కఠిన చర్యలు:జీకే వీధి సీఐ సుధాకర్ 

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 25:మండలంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. యువకుల్లో మార్పు రాకపోవడంతో ఇకపై త్రిబుల్ రైడింగ్ మరియు రాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని గూడెం కొత్తవీధి సీఐ సుధాకర్ హెచ్చరించారు.వాహనదారుల్లో చాలామంది లైసెన్స్, హెల్మెట్, సరైన వాహన పత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు వారికి అవగాహన కల్పించేందుకు కేవలం కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించామని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ఇకపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు....