దళితుల సమస్యలపై ఐటిడిఏ పీఓ, డాక్టర్ జమాల్ ఖాన్‌ను కలిసిన సంఘ నాయకులు
చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 23 : చింతూరు ప్రాంతంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దళిత కుటుంబ సంక్షేమ సంఘం నాయకులు చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి (పీఓ)ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సంఘ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, చింతూరులో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న దళితులకు అత్యవసరమైన స్మశాన వాటిక లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, దళిత కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే పాతిపెట్టడానికి స్థలం లేక...