దామనపల్లి పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18:మండలంలోని దామనపల్లి పంచాయతీ పరిధిలోని కట్టుపల్లి గ్రామంలో అలాగే పంచాయతీ కేంద్రంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుపల్లిలో జరిగిన కార్యక్రమాన్ని ఎంపీడీవో బి.హెచ్.వి. రమణబాబు పరిశీలించారు.అనంతరం పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్. లక్ష్మి సమక్షంలో స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త–పొడి చెత్తలను వేర్వేరుగా సేకరణకు వచ్చే క్లాప్ మిత్రులకు అందించాలని సూచించారు. అలాగే ఐవీఆర్ కాల్స్‌కు సానుకూలంగా స్పందించాలని...