నిర్వాసితులకు హెచ్చరిక గడువు లోపు పత్రాలు ఇవ్వాలి
చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: విఆర్‌పురం మండలానికి చెందిన నాన్ ఎస్టీ ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ (పిడిఎఫ్స్) పునరావాస ప్రక్రియలో భాగంగా సమర్పించాల్సిన ఆప్షన్ ఫారమ్‌ల స్వీకరణ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ అనేక మంది లబ్ధిదారులు తమ ఫారమ్‌లను పూర్తిగా సమర్పించకపోవడం ఆందోళన కలిగిస్తోంది అని ఐటిడిఏ చింతూరు ప్రాజెక్ట్ అధికారి తెలిపారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పునరావాస కార్యక్రమంలో, లబ్ధిదారులు ఎంచుకునే విధానం గవర్నమెంట్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లేదా వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటిఎస్) పై స్పష్టత...