నీటి భద్రత, సంరక్షణ అందరి బాధ్యత

సాగునీటి సంరక్షణకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రారంభం రామచంద్రపురం/కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6: మానవాళి మనుగడకు నీరు అత్యవసరమని, నీటి భద్రత మరియు సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.సాగునీటి సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సోమవారం వెల్ల గ్రామంలో ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కోరింగ కాలువ, వెల్ల లాకులు, గుర్రపు డెక్క తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు.చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ,భూగర్భ జలాల...