నేడు అందుబాటులో తిరుమల లడ్డు
రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 10: మన రంపచోడవరం ఐ.పోలవరం పరిధిలోని గోవింద గిరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ శనివారం నాడు తిరుమల నుండి వచ్చే లడ్డు ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు ఈ. రూప్ సాయి మరియు ఢిల్లీ ప్రసాద్ కోరారు.