నేలపాడు గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 11: రింతాడ పంచాయతీ పరిధిలోని నేలపాడు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ (ఆల్ ఇండియా ఆదివాసి స్వయం పాలన సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు) ఆధ్వర్యంలో ప్రజలు, చిన్నారుల మధ్య ఈ కార్యక్రమాన్ని “మహనీయుల స్ఫూర్తి దినంగా” నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాతగా పూలే చేసిన సేవలు, త్యాగాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆదివాసుల పోరాట...