పంచాయతీలకు ప్రత్యేకాధికారులు నియామకం

కాజులూరు మండలంలో సర్పంచ్ పాలనకు ముగింపు – ప్రభుత్వం జీఓ నెం.47 విడుదల కాజులూరు, ఏప్రిల్ 2 (పెన్‌పవర్): రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పాలనకు గురువారంతో ముగింపు పలికింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జీఓ నెం.47ను విడుదల చేసింది. ఈ మేరకు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో కాజులూరు మండలంలో తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్, ఎంపీడీవో జె.రాంబాబు, అగ్రికల్చర్ ఆఫీసర్ వి.అశోక్, ఎంఈవో-1 డి.డేవిడ్,...