రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తూ, లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి తెలిపారు.బుధవారం గంగవరం మండలం జడేరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో...