పది ఫలితాల్లో కాజులూరు మండల జడ్పీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ పతాక స్థాయిలో
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 30: కాజులూరు మండల పరిధిలోని వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. మండల వ్యాప్తంగా పలు పాఠశాలలు ఉన్నత ఉత్తీర్ణత శాతం నమోదు చేయడంతో పాటు, అనేక మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం గమనార్హం. శీల జడ్పీహెచ్ఎస్‌లో రాపాకుల రేష్మ, కర్నీడి జోష్న నవ్యశ్రీలు 554 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, మంగతాయారు 553 మార్కులతో ద్వితీయ స్థానం, సఖిలే...