పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ బాధ్యతలు స్వీకారం

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 11:పాడేరు ఐటిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పనిచేసిన తిరుమాని శ్రీపూజ నుండి ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆదిత్య వర్మ కుటుంబ సమేతంగా మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యస్వామి వారికి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం ఐటిడిఏ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పరిపాలనాధికారి హేమలత పుష్పగుచ్ఛం అందజేసి సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా...