పాతమంజేరు లో ఘనంగా గంటాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ
నూతన ఆలయం నిర్మాణంతో గ్రామంలో పండుగ వాతావరణం కాజులూరు, ఏప్రిల్ 18 ,పెన్‌పవర్: మండల పరిధిలోని పాతమంజేరు గ్రామంలో గ్రామదేవతగా పూజించబడే గంటాలమ్మతల్లికి నూతన ఆలయం నిర్మించి, ఈ నెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.పూర్వీకుల కాలం నుంచే పాతమంజేరు గ్రామస్తులు గంటాలమ్మతల్లిని తమ గ్రామదేవతగా కొలుస్తూ వస్తున్నారు. గ్రామానికి రక్షక దేవతగా ఆమెను భావిస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, కరువు, ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తుంటారు. ఈ సందర్భంగా...