పునరావాస కాలనీల్లోనే రేషన్ బియ్యం అందించాలని గిరిజనుల వినతి
చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 21: పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రభావిత నిర్వాసితులకు పునరావాస కాలనీల్లోనే రేషన్ బియ్యం అందించాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని కోరారు. ఈ మేరకు మంగళవారం చింతూరులోని ఐటిడిఏ కార్యాలయంలో పి.ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. నాయకులు మాట్లాడుతూ, వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీ పరిధిలోని కల్తునూరు గ్రామ నిర్వాసితులకు ఎటపాక మండలం కన్నాయిగూడెంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడ ఇంకా రోడ్లు, మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించాల్సి ఉందని తెలిపారు....