పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట బందోబస్తు – కాకినాడ ఎస్పీ

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 27: జిల్లాలో ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న 160 పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, తెలిపారు.ఈ ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ శాఖల అధికారులతో కలిపి 57 జాయింట్ ఇన్‌స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంధన రవాణా నిరంతరంగా కొనసాగేందుకు ట్యాంకర్లకు ప్రత్యేక “గ్రీన్ ఛానల్” ఏర్పాటు...