రంపచోడవరం, పెన్ పవర్: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విధానంపై సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే నిధులతో అమలు చేసే సంక్షేమ పథకాలను రాజకీయ పార్టీల ప్రచార వేదికలుగా మార్చడం అనర్హమని విమర్శించింది.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు, రంపచోడవరం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల...