పేటలో అదుపుతప్పిన కారు
గుడిసెలోకి దూసుకెళ్లిన వైనం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 16: చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ వద్ద గురువారం ఒక కారు బీభత్సం సృష్టించింది. నరసరావుపేట వైపు వెళుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కారులో ముగ్గురు యువకులు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కేకలు వేయడంతో, కారులో ఉన్న వారు వాహనాన్ని...