గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, ఏప్రిల్ 1: పోలవరం జిల్లా ఏజెన్సీ పరిధిలోని రంపచోడవరం మండలం పోక్స్‌పేట పంచాయతీ నరసాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడిన ఆయన, వారి కుటుంబ సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి అందుతున్నదా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అక్కడికక్కడే తెలియజేసిన సమస్యలను సంబంధిత...