పేద గిరిజన విద్యార్థులకు గ్రూప్స్ మెటీరియల్ అందజేసిన ఉప తహసీల్దార్ 

ఆదర్శంగా నిలుస్తున్న దుమంతి సత్యనారాయణ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 14: అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా గూడెం కొత్తవీధి ఉప తహసీల్దార్ దుమంతి సత్యనారాయణ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. నిరుపేద గిరిజన నిరుద్యోగ యువతకు వేల రూపాయల విలువైన గ్రూప్స్ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందజేసి ఆయన తన ఉదారతను చాటుకున్నారు.అల్లూరి జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన దుమంతి సత్యనారాయణ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి...