పోలవరం జిల్లాలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
పరిపాలనలో కీలక మార్పులు రంపచోడవరం, ఏప్రిల్ 18 (పెన్ పవర్): రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం జిల్లాలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. విజయవాడలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సూరపాటి ప్రశాంత్ కుమార్‌ను పోలవరం జిల్లాకు జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా ఆయనకు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో పాటు, సబ్ కలెక్టర్...