పోషణ పక్వాడ ద్వారా బాలల మేధాశక్తి పెంపు లక్ష్యం
జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 8: పోలవరం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో బాలబాలికల మేధాశక్తి పెంపొందించేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026 సంవత్సరం 8వ పోషణ పక్వాడ పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టుల...