ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై ఎన్రోల్మెంట్ డ్రైవ్

కాజులూరు, ఏప్రిల్‌ 9: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు కీలకమని చాటి చెప్పే విధంగా కాజులూరు మండలంలో గురువారం ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ-1 ఎంఈఓ-2 సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాజులూరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు మార్ని విష్ణుమూర్తి,ఎంపీ ఎస్ హెడ్‌మాస్టర్ దుర్గారావు, మండల ఏవో పద్మలత,ఎంఈఓ-1 దాసరిపల్లె డేవిడ్,ఎంఈఓ-2 పి. జాన్ తదితరులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు. “ప్రభుత్వ బడుల్లో చదువులు మీ పిల్లల జీవితానికి వెలుగులు...