ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ ముందడుగు..

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 19 రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేసింది. ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్‌లు, ప్రమాదకర మలుపుల వద్ద కుంభాకార దర్పణాలను ఏర్పాటు చేస్తూ వాహనదారుల భద్రతపై దృష్టి సారించింది.జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మార్కాపురం సబ్‌డివిజన్ డీఎస్పీ యు. నాగరాజు పర్యవేక్షణలో యర్రగొండపాలెం సీఐ కె అజయ్ కుమార్, పుల్లలచెరువు ఎస్‌ఐ బి. సాంబశివరావు ప్రత్యేకంగా ప్రమాదకర ప్రదేశాలను గుర్తించారు. పుల్లలచెరువు మండలంలోని మలుపులు, జంక్షన్లు, వై-జంక్షన్‌లు, యూ-టర్న్‌లు, విజిబిలిటీ...