చింతూరు, పన్ పవర్ ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఇటీవల బస్సుల్లో అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రవాణాశాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖల సంయుక్త బృందాలు బుధవారం తెల్లవారుజామున చింతూరులో బస్సులను విస్తృతంగా తనిఖీ చేశాయి. మూడు శాఖల సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బండారు చల్లారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా...