బాధిత కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
బాధిత కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి -స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం, పెన్ పవర్ : ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఒకే రోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,28,729 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇందులో గొలుగొండ మండలానికి 6, మాకవరపాలెం...