బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాద స్థలాల పరిశీలన

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 27:మండలంలోని బూదరాళ్ల–బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, పిఆర్ -పిఐయు మండల ఇంజనీరింగ్ అధికారితో కలిసి నాలుగు ప్రమాద ప్రదేశాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా రహదారి భద్రత మెరుగుదలకు పలు చర్యలను గుర్తించారు. మలుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రహదారి వెడల్పును పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక ప్రదేశంలో హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని...