మంచినీటి కోసం అల్లాడుతున్న మాకవరం
మంచినీటి సౌకర్యం కల్పించాలన్న టిడిపి నేత చెండా బాబుజి. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.మండలంలో గల మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి ఎద్దడితో గ్రామం తలడిల్లుతుంది. 80 కుటుంబాలుగా ఉన్న గ్రామంలో ఒకే ఒక్క బోరు, ఓ ఊటగెడ్డ నీళ్లు మాత్రమే గ్రామస్తులకు దిక్కుగా మారింది. వేసవి దృష్ట్యా గ్రామస్తులు నీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సోమవారం పర్యటించిన టిడిపి నేత బాబుజి దృష్టికి గ్రామస్తులు సమస్యలు తీసుకురాగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారుల...