మంజేరులో అభినందన సభ – ఐదేళ్ల అభివృద్ధిపై ప్రశంసలు
కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 02: కాజులూరు మండలంలోని మంజేరు గ్రామంలో గ్రామాభి వృద్ధికి సర్పంచ్ గుంటూరి అప్పారావు ఐదేళ్లుగా చేసిన సేవలకు గుర్తింపుగా గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సర్పంచ్ గుంటూరి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పంచాయతీ సెక్రటరీ ఎస్.శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించిన ఈ సభలో గత ఐదేళ్లలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులు ప్రశంసించారు. మౌలిక వసతుల మెరుగుదల,డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్యం,తాగునీటి సదుపాయాల కల్పన వంటి అంశాల్లో...