మంజేరు గ్రామంలో పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా – ధర్మకర్తల ఆధ్వర్యంలో ఘన నిర్వహణ కాజులూరు, ఏప్రిల్ 27 ,పెన్ పవర్: కాజులూరు మండల పరిధిలోని మంజేరు గ్రామంలో ఉన్న శ్రీ నవదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్తలు మరియు ఎఎంసి వైస్ చైర్మన్ దడాల నాగార్జున – నాగేశ్వరి దంపతుల చేతుల మీదుగా...