మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ‘గ్రీవెన్స్ డే’ తప్పనిసరి:జిల్లా కలెక్టర్ నిశాంతి

అధికారులందరూ హాజరు కావాలి స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 12: ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో ‘మీ కోసం గ్రీవెన్స్ డే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ, ఐటిడిఎ పీఓ ఆదిత్య వర్మ, ఆర్డీవో ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, డిఆర్వో నీలకంఠరావు తదితరులతో కలిసి కలెక్టర్ మాట్లాడారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు.ప్రతి సోమవారం నిర్వహించే...