మన్యం జాతర్లు గిరిజన సంస్కృతికి ఆనవాళ్లు
శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డాక్టర్ వంపూరు గంగులయ్య చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 17: మన్యంలో నిర్వహించే గ్రామదేవతల జాతర్లు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఏపీ జానపద కళలు, సంస్కృతి సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య పేర్కొన్నారు.శుక్రవారం చింతపల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గంగులయ్యను ఘనంగా సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుతూ, గిరిజన సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే...