PEN POWER
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 2:33 pm Posted By : ANIL KUMAR G

మహిళల భద్రతపై ఉపాధి కూలీలకు అవగాహన

జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 10 : జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు శుక్రవారం జగ్గంపేట ఎస్ ఐ టి.రఘునాథరావు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ పై అవగాహన కల్పించారు. ప్రజలు అవగాహన లోపంతో సైబర్ నేరాలకు గురవుతున్నారన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అంటే ఎటువంటి వివరాలు చెప్పరాదని వివరించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ పై తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. మహిళా హక్కు చట్టాల కోసం వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధి కూలీలు ఉన్నారు.