మానవత్వం చాటుకున్న వైకాపా నేత అంజి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో అంజి సేవలు అభినందనీయం గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్9:అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పరిధిలోని రింతాడ–ముల్లుమెట్ట మధ్య రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రత వల్ల వారు రోడ్డుకు సుమారు 15 అడుగుల దూరంలో ఉన్న టేకు చెట్ల మధ్య పడిపోయి, కాళ్లు విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.గాయపడిన యువకులు చింతపల్లి మండలం అన్నవరం సమీపంలోని కూర్మన్నపాకలు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. సంఘటన...