మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో గిరిజన రైతులకు పట్టాల పంపిణీ

గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు పంచాయితీ పరిధిలోని చీడిపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం కింద గిరిజన రైతులకు రాజముద్రతో కూడిన భూమి పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రీ సర్వే పూర్తయిన రైతులకు ప్రతి నెలా పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చీడిపాలెం గ్రామంలో మొత్తం 84 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ...