ముఖ హాజరు కోసం ఉపాధి వేతనదారుల పాట్లు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న వేతనదారులు ‘ముఖ హాజరు’ నమోదు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం అమ్మవారి దారకొండ గ్రామానికి చెందిన గిరిజనులు ఈ సమస్యపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి దూరంగా ఉన్న కొండప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్న కార్మికులు ఉదయం యాప్ ద్వారా ముఖ హాజరు నమోదు చేసుకున్నప్పటికీ, మధ్యాహ్నం హాజరు నమోదు కాకపోవడంతో గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా...