మూడు దొంగతనాల కేసుల్లో నిందితుడికి జైలుశిక్ష
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 28: కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు రాత్రి దొంగతనాల కేసుల్లో నిందితుడికి కోర్టు జైలుశిక్ష విధించింది. ఒక్కో కేసుకు ఒక సంవత్సరం చొప్పున మొత్తం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. విజయ రామేశ్వరి తీర్పు వెలువరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2020 సంవత్సరంలో పిఠాపురం టౌన్ పరిధిలోని సీతయ్యగారితోట, మళయాలవారి వీధి, వేణుగోపాల స్వామి గుడి వీధి ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను...