మోదకొండమ్మ జాతరపై రాజకీయాలు తగవు
గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 16: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాడేరు శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. అమ్మవారితో ఆటలాడొద్దని హెచ్చరించారు.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు కలిసి జాతర తేదీలను మే 10, 11, 12గా నిర్ణయించారని తెలిపారు. అయితే గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాతరను మే 17,...