యువతకు వ్యాపార నైపుణ్యాలే భవిష్యత్తు
– సైస్ కంప్యూటర్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమంకాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 2:యువతలో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించేందుకు సైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 20 రోజుల ఎంటర్ ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైసింగ్ అండ్ అక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు (రాంప్) కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధి అధికారి సీహెచ్ శిరీష హాజరై మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువతకు...